about us

సాహిత్యం అంతులేని సాగరం ఇందులో ఈదడం అనేది ఒక అంతులేని అనుభూతి . ఈ సాహిత్యం అనుకొంటే వచ్చేది కాదు . ఇందులో భాషపై పట్టు ఉండాలి సామాజిక స్పృహ ఉండాలి . ఇందులో నెగ్గుకు రావడం అనేది ఒక తపస్సు . పరిస్తితులు అనుకూలించవు . సమయం చిక్కదు కొన్ని సంధర్భల్లో కలం కదలనంటున్ది . మరికొన్ని సంధారభాల్లో కలమే మనల్ని నడిపిస్తుంది . సరళమైన శైలి చక్కటి కథ శిల్పం . పాటకుణ్ణి కడవరకు తీసుకెళ్లడమే సాహితి వేత్త లక్ష్యం అయి ఉండాలి . రచన సమయంలో హృదయం ద్రవించి అది కన్నులద్వార జారిపోవళి అప్పుడే పాటకుడు ప్రభావితం అవుతాడు . రచయిత పాటకుడిని నవ్వించాలి , ఏడిపించాలి చదివాక చక్కటి అనుభూతిని అందించాలి . అదే రచయిత గొప్పతనం .
దానికి రచయితకు కావలసినది స్పందన . అదే హృదయ స్పందన . అప్పుడే సాహిత్యం కలకాలం సజీవంగా ఉంటుంది .
ఇక నవిషయానికి వస్తే నేను మధ్య తరగతి లో నుండి వచ్చిన వాణ్ని నాకు మనిషి జేవితం ఏమిటో బాగా చదివిన వాణ్ని . కస్టాలు ఏమిటో ఎరిగిన వాణ్ని కన్నీళ్లను దిగా మింగనవాన్ని . ఈ అభిరుచి యే నన్ను రచయిత గా మార్చింది . నా చిన్న తనంలో అనేక కథలు వ్యాసాలు రాసిన వాణ్ని . అదే స్పూర్తి నేటి ఆధునిక రచన వైపు పూరిగొలిపింది . అందుకే ఈ అదునిక యుగంలో నన్ను బ్లాగ్ ద్వారా రచనలు చేసేందుకు స్పూర్తిని ఇచ్చింది . అందుకే తీరిగి కలం పట్టి సాహిత్యపు సేద్యాన్ని చేసేందుకు పూనుకొన్నాను ఇది నా గురించి నేను చెప్పుకొనే విషయం .